‘సమ సమాజ నిర్మాణమే లక్ష్యం’ | 'Goal of having the structure of society' | Sakshi
Sakshi News home page

‘సమ సమాజ నిర్మాణమే లక్ష్యం’

Aug 11 2016 1:16 AM | Updated on Sep 4 2017 8:43 AM

సమ సమాజ నిర్మాణమే అభ్యుదయ సాహిత్య లక్ష్యమని భారతీయ అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శి పెనుకొండ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : సమ సమాజ నిర్మాణమే అభ్యుదయ సాహిత్య లక్ష్యమని భారతీయ అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శి పెనుకొండ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అభ్యుదయ సాహిత్యం 80 ఏళ్ల చరిత్ర కలిగి ఉందన్నారు. సమ సమాజ నిర్మాణమే అభ్యుదయ సాహిత్య లక్ష్యమన్నారు. మార్క్సిజం, తాత్విక నేపథ్యం ద్వారా పేదలవైపు నిలబడి సాహిత్యాన్ని సృష్టించేదే అభ్యుదయ సాహిత్యమన్నారు. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, మహిళలు దళితులు 90 శాతం అభ్యుదయ సాహిత్యం వైపు ఉన్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిలుకూరి దేవపుత్ర, మల్లెల నరసింహమూర్తి, రాజారెడ్డి, నాగేంద్రగౌడ్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement