గణేష్‌ ఉత్సవాలతో నగరానికి కీర్తి | Ganesh celebration of the glory of the city | Sakshi
Sakshi News home page

గణేష్‌ ఉత్సవాలతో నగరానికి కీర్తి

Sep 10 2016 10:19 PM | Updated on Sep 4 2017 12:58 PM

వినాయక పూజలో దానం నాగేందర్‌ తదితరులు

వినాయక పూజలో దానం నాగేందర్‌ తదితరులు

గణేష్‌ ఉత్సవాలతో నగర ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతోందని మాజీ మంత్రి దానం నాగేందర్‌ పేర్కొన్నారు

అబిడ్స్‌: గణేష్‌ ఉత్సవాలతో నగర ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతోందని మాజీ మంత్రి దానం నాగేందర్‌ పేర్కొన్నారు. గోషామహల్‌ హిందీనగర్‌లో మార్కెట్‌ మాజీ డైరెక్టర్‌ టి. సతీష్‌కుమార్‌ ఏర్పాటు చేసిన గణేష్‌ మండపంలో శనివారం దానం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో గ్రేటర్‌ కాంగ్రెస్‌ నేతలు సతీష్, బీజేపీ నేత బంగారు సుధీర్‌ కుమార్, టీఆర్‌ఎస్‌ నాయకులు ధన్ రాజ్, కేంద్ర ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యులు గడ్డమీది నరేందర్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement