ఆ పోరాటమే గాంధీకి స్ఫూర్తి | Gandhiji asramam | Sakshi
Sakshi News home page

ఆ పోరాటమే గాంధీకి స్ఫూర్తి

Aug 21 2016 9:56 PM | Updated on Sep 4 2017 10:16 AM

ఆ పోరాటమే గాంధీకి స్ఫూర్తి

ఆ పోరాటమే గాంధీకి స్ఫూర్తి

పల్లిపాడు(ఇందుకూరుపేట) : దక్షిణాఫ్రికాలో అహింసాయుత మార్గంలో గాంధీ చేసిన పోరాటం ఆయనకు దేశంలో మరెన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసెందుకు స్ఫూర్తినిచ్చిందని తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షురాలు గంగవరం శ్రీదేవి అన్నారు.

పల్లిపాడు(ఇందుకూరుపేట) : దక్షిణాఫ్రికాలో అహింసాయుత మార్గంలో గాంధీ చేసిన పోరాటం ఆయనకు దేశంలో మరెన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసెందుకు స్ఫూర్తినిచ్చిందని తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షురాలు గంగవరం శ్రీదేవి అన్నారు. మండలంలోని పల్లిపాడు పినాకినీ సత్యగ్రహ గాంధీ ఆశ్రమంలో ఆదివారం జరిగిన గాంధీ అధ్యయన తరగతుల్లో ఆమె పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమంలో గాంధీ పాత్ర అనే అంశంపై మాట్లాడారు. ఉద్యమాల్లో గాంధీ ఎప్పుడు రాజకీయ ప్రయోజనాలను ఆశించలేదన్నారు. స్వాతంత్ర పోరాట సమయంలో హిందూ, ముస్లింల మధ్య వివాదాలు తొలగించి వారి ఐకత్యకు పాటుపడ్డారన్నారు. తొలుత ఆశ్రమ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ మోహన్‌ముని సిద్దారెడ్డి, ఆశ్రమ కమిటీ కన్వీనర్‌ గణేశం కష్ణారెడ్డి, సభ్యులు నారాయణ, రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement