72 గంటల బంద్‌ పరిపూర్ణం | Gadwal Bhand copmlete | Sakshi
Sakshi News home page

72 గంటల బంద్‌ పరిపూర్ణం

Aug 28 2016 10:22 PM | Updated on Sep 4 2017 11:19 AM

గద్వాల : గద్వాలను జిల్లా చేయాలని డిమాండ్‌ చేస్తూ జేఏసీ చేపట్టిన 72 గంటల నిరవధిక బంద్‌ పరిపూర్ణంగా విజయవంతమైంది. బంద్‌లో భాగంగా మూడోరోజు ఆదివారం సైతం తెల్లవారుజాము నుంచే జేఏసీ నాయకులు ద్విచక్రవాహనాలపై తిరుగుతూ బంద్‌ను పాటించారు.

– స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన ప్రజలు
– మూడో రోజు తెరచుకోని దుకాణాలు
– గద్వాలలో స్తంభించిన జనజీవనం
గద్వాల : గద్వాలను జిల్లా చేయాలని డిమాండ్‌ చేస్తూ జేఏసీ చేపట్టిన 72 గంటల నిరవధిక బంద్‌ పరిపూర్ణంగా విజయవంతమైంది. బంద్‌లో భాగంగా మూడోరోజు ఆదివారం సైతం తెల్లవారుజాము నుంచే జేఏసీ నాయకులు ద్విచక్రవాహనాలపై తిరుగుతూ బంద్‌ను పాటించారు. దుకాణదారులు, పెట్రోలు బంకులు, సినిమా థియేటర్లు స్వచ్ఛంద బంద్‌ పాటించాయి. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నేరుగా బంద్‌లో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలు మాత్రం యథావిధిగా నడిచాయి. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై గద్వాల నినాదాలతో హోరెత్తించారు.
 
మూడు రోజుల నిరవధిక బంద్‌తో..
జేఏసీ బంద్‌తో గద్వాలలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మూడు రోజుల పాటు వరుసగా బంద్‌ చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం గద్వాల జిల్లా కోసం వరుసగా మూడు రోజులు బంద్‌ చేశారు. దీంతో అన్ని వాణిజ్య సముదాయాలు స్వచ్ఛంద బంద్‌ పాటించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చిన్న టీకొట్టు నుంచి పెద్ద దుకాణం వరకు మూతబడ్డాయి. మూడు రోజుల పాటు పెట్రోలు బంకులు తెరచుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. గద్వాల నియోజకవర్గం మొత్తం పెట్రోలు, డీజిల్‌ విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. గద్వాల జిల్లా సాధించే వరకు తమ ఉద్యమాన్ని ఉధతం చేస్తామని జేఏసీ నాయకులు వెంకట్రాములు, మధుసూదన్‌బాబు అన్నారు. బంద్‌లో భాగంగా వారు మాట్లాడుతూ ఆంక్షలు, అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వీరభద్రప్ప, వెంకట్రాజారెడ్డి, అంపయ్య, కష్ణారెడ్డి, శంకర్, భీంసేన్‌రావు, రాజశేఖర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement