ప్రాణం తీసిన సరదా | fun takes life | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన సరదా

Jan 29 2017 10:24 PM | Updated on Sep 5 2017 2:25 AM

ప్రాణం తీసిన సరదా

ప్రాణం తీసిన సరదా

సరదాగా స్నేహితులతో కలిసి ఈత కెళ్లిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

కేసీ కెనాల్‌లో ఈతకు వెళ్లి యువకుడి మృతి
నందికొట్కూరు: సరదాగా స్నేహితులతో కలిసి ఈత కెళ్లిన ఓ యువకుడు  ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం నాగటూరు గ్రామం వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నందికొట్కూరు పట్టణంలోని లింగం వీధికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ మౌలాలి కుమారుడు మౌలిబాషా(22) అదేవీధికి చెందిన అమ్మాయి  ఎంగేజ్‌మెంట్‌ జరుగుతుంటే శనివారం రాత్రి నాగటూరు గ్రామానికి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆదివారం ఉదయం నలుగురు స్నేహితులతో  కలిసి కేసీ కెనాల్‌కు సరదాగా ఈతకు వెళ్లారు.  అయితే, ఈతకొడుతూ నీటిలో మునిగిపోయి ప్రాణాలు వదిలాడు. తోటి స్నేహితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు  అక్కడికి చేరుకుని యువకుడి మృత దేహాన్ని  నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం  తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement