నకిలీ పార్శిల్‌తో టోకరా | frod message with parcle | Sakshi
Sakshi News home page

నకిలీ పార్శిల్‌తో టోకరా

Jul 30 2016 9:08 AM | Updated on Sep 4 2017 6:57 AM

నకిలీ పార్శిల్‌తో టోకరా

నకిలీ పార్శిల్‌తో టోకరా

అచ్చంపేట: ఖరీదైన సెల్‌ఫోన్, రిస్ట్‌వాచ్‌ లాటరీలో తగిలిందన్న అపరిచితుల కాల్‌ను నమ్మి రూ.3 వేలు మోసపోయాడు ఓ బాధితుడు.

అచ్చంపేట: ఖరీదైన సెల్‌ఫోన్, రిస్ట్‌వాచ్‌ లాటరీలో తగిలిందన్న అపరిచితుల కాల్‌ను నమ్మి రూ.3 వేలు మోసపోయాడు ఓ బాధితుడు. అచ్చంపేటకు చెంది కత్తి చంద్రం సెల్‌ఫోన్‌కు నాలుగురోజుల కిందట ఢిల్లీ నుంచి ఓ కాల్‌ వచ్చింది. ఆయుర్వేదిక్‌ హెర్బల్‌ కంపెనీ తరపున నీ ఫోన్‌ నెంబరుకు బంపర్‌ ఆఫర్‌ తగిలిందని, అందులో రూ.30 వేల చెక్కు, రూ.15 వేల ఖరీదు చేసే శ్యాంసంగ్‌ గెలాక్సీ ఫోను, రూ.5 వేల విలువచేసే రిస్ట్‌వాచ్‌ వచ్చాయని చెప్పారు.

అడ్రస్‌ చెప్తే పార్శిల్‌ పంపుతామని నమ్మించారు. నిజమేనని నమ్మిన చంద్రం వారికి తన చిరునామా ఇచ్చాడు. వారు చెప్పినట్టుగానే శుక్రవారం అతని పేరిట పోస్టాఫీసుకు ఒక పార్శిల్‌ వచ్చింది. రూ.3వేలు చెల్లించి తీసుకోవాలని పోస్టుమ్యాన్‌ చెప్పడంతో అలాగే తీసుకున్నాడు. విప్పిచూడగా అందులో మూడు ప్యాకెట్ల భస్మం, కొన్ని చిత్తు కాగితాలు, ఒక చెక్కపెట్టె ఉన్నాయి. తాను మోసపోయానని గ్రహించిన చంద్రం శుక్రవారం అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement