కానిస్టేబుల్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ | free training for constables | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ

Aug 4 2016 9:44 PM | Updated on Mar 19 2019 6:01 PM

శారదా సపారె చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ ప్రతినిధి రాజశేఖర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం న్యూటౌన్‌ : శారదా సపారె చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ ప్రతినిధి రాజశేఖర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణలో భాగంగా స్పోకెన్‌ ఇంగ్లిషు కూడా నేర్పిస్తామన్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌లో సాగే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9440221254 నంబర్లో సంప్రదించాలన్నారు.

టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో..
అదేవిధంగా జిల్లా ప్రైవేటు టీచర్ల సంఘం ఆధ్వర్యంలో కానిస్టేబుల్‌ పరీక్షల ఉచిత శిక్షణ గడువును ఈనెల 8 వరకు పొడిగిస్తున్నట్టు సంస్థ అధ్యక్షులు కాశన్న ఓ ప్రకటనలో తెలిపారు.  ఆసక్తి గల  9490008729 నంబర్లో సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement