
ఎవరూ చేయని తప్పు మోదీ చేశారు: ఉండవల్లి
మోదీ దేశంలో ఎకనమిక్ ఎమర్జెన్సీని సృష్టించారని ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు
రాజమండ్రి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలో ఎవరూ చేయని తప్పును చేసి, దేశంలో ఎకనమిక్ ఎమర్జెన్సీని సృష్టించారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ చేసిన ప్రకటనతో దేశంలోని కష్టజీవులకు దెబ్బ తగిలిందని ఆయన అన్నారు.
పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా బ్లాక్ మనీ ఉన్నవారు ఎలాంటి ఇబ్బంది పడలేదని ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. గతంలో రూ. 96 వేల కోట్ల మేర విదేశాలకు తరలిపోతే.. ఈ ఏడాది రూ. 2 లక్షల 76 వేల కోట్లు బయటకు పోయిందని ఆయన అన్నారు. మోదీ అనుభవరాహిత్యమే దీనంతటికీ కారణమని ఉండవల్లి విమర్శించారు.