తంగడంచెలో జైన్ ఇరిగేషన్ నెలకొల్పనున్న ఫుడ్ పార్క్‌కు సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో శంకు స్థాపన చేయనున్నారని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు.
త్వరలో ఫుడ్ పార్క్‌కు శంకుస్థాపన
Jun 10 2017 11:57 PM | Updated on Sep 5 2017 1:17 PM
కర్నూలు(అగ్రికల్చర్): తంగడంచెలో జైన్ ఇరిగేషన్ నెలకొల్పనున్న ఫుడ్ పార్క్‌కు సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో శంకు స్థాపన చేయనున్నారని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన జైన్ ఇరిగేషన్ ప్రతినిధులు, పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21 లేదా 23వ తేదీల్లో ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని, నంద్యాల, ఓర్వకల్ మండలాలతో పాటు తంగడంచెలోను పర్యటిస్తారని వివరించారు. ఫుడ్ పార్క్‌కు శంకు స్థాపన సందర్భగా రైతులతో సమావేశం అవుతారన్నారు. సమావేశంలో జైన్ ఇరిగేషన్ ప్రతినిధి సమీర్‌శర్మ, జిల్లా పరిశ్రమల కేంద్రం డీడీ మధన్‌మమోహన్ శెట్టి, ఏపీఐఐసీ అధికారి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement