breaking news
tangadancha
-
త్వరలో ఫుడ్ పార్క్‌కు శంకుస్థాపన
కర్నూలు(అగ్రికల్చర్): తంగడంచెలో జైన్ ఇరిగేషన్ నెలకొల్పనున్న ఫుడ్ పార్క్‌కు సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో శంకు స్థాపన చేయనున్నారని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన జైన్ ఇరిగేషన్ ప్రతినిధులు, పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21 లేదా 23వ తేదీల్లో ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని, నంద్యాల, ఓర్వకల్ మండలాలతో పాటు తంగడంచెలోను పర్యటిస్తారని వివరించారు. ఫుడ్ పార్క్‌కు శంకు స్థాపన సందర్భగా రైతులతో సమావేశం అవుతారన్నారు. సమావేశంలో జైన్ ఇరిగేషన్ ప్రతినిధి సమీర్‌శర్మ, జిల్లా పరిశ్రమల కేంద్రం డీడీ మధన్‌మమోహన్ శెట్టి, ఏపీఐఐసీ అధికారి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
తంగడంచెలో మెగా సీడ్ పార్క్
- అమెరికాలోని ఐఓడబ్ల్యూఏ స్టేట్ యునివర్సిటీ సాంకేతిక సహకారం - ఒకటి, రెండు నెలల్లో సీఎం చేతులు మీదుగా శుంకుస్థాపనకు చర్యలు - వ్యవసాయశాఖ కమిషనర్ హరి జవహర్లాల్ కర్నూలు(అగ్రికల్చర్): జూపాడుబంగ్లా మండలం తంగడంచ ఫామ్‌లో ఆసియాలోనే అతిపెద్ద మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరి జవహార్‌లాల్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన సోమవారం తంగడంచెకు వెల్లి అమెరికాలోని ఐఓడబ్ల్యూఏ స్టేట్ యునివర్సిటీ ప్రతినిధులతో కలసి భూములను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణతో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీడ్ పార్క్‌ను అమెరికాలోని ఐఓడబ్ల్యూఏ స్టేట్ యునివర్సిటీ సాంకేతిక సహకారంతో నెలకొల్పుతున్నట్లు చెప్పారు. ఒకటి, రెండు నెలల్లో ప్రాథమిక పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులుమీదుగా శంకు స్థాపన చేస్తామన్నారు. ప్రస్తుతం తంగడంచెలో 805 ఎకరాల భూములు ఉన్నాయని, సీడ్ పార్క్‌కు ఎంత అవసరమైతే అంత ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విత్తనోత్పత్తి, పరిశోధన, శిక్షణ, సీడ్ సర్టిపికేషన్ కార్పోరేషన్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం శాఖ తదితర వన్ని ఇందులో ఉంటాయన్నారు. ఆయన వెంట నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ గోపాల్‌రెడ్డి, డీడీఏ పీపీ మల్లికార్జునరావు, ఏడీఏలు రమణారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, కర్నూలు ఏఓ అశోక్‌కుమార్‌రెడ్డి తదితరులున్నారు.