శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 42 గేట్లు ఎత్తివేత | Flood worsens as sriram sagar projects 42 gates opened | Sakshi
Sakshi News home page

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 42 గేట్లు ఎత్తివేత

Sep 24 2016 8:06 PM | Updated on Aug 1 2018 4:01 PM

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 42 గేట్లు ఎత్తివేత - Sakshi

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 42 గేట్లు ఎత్తివేత

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ)కు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది.

నిజామాబాద్ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ)కు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో 4.50 లక్షల ఉండటంతో  అధికారులు శనివారం ప్రాజెక్ట్ 42 గేట్లు ఎత్తివేశారు. రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 1089 అడుగులకు చేరింది. కాగా ఇన్ఫ్లో 6 లక్షల క్యూసెక్కులకు పెరుగుతుందని అంచనా. మూడేళ్ల తర్వాత శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. మరోవైపు అధికారులు దిగువ ప్రాంతాలను కూడా ముందు జాగ్రత్తగా అప్రమత్తం చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement