ఈ చేప రూ. ముప్పై వేలు | Fisherman spots rare fish in Chirala | Sakshi
Sakshi News home page

ఈ చేప రూ. ముప్పై వేలు

Aug 8 2016 8:09 AM | Updated on Sep 4 2017 8:25 AM

ఈ చేప రూ. ముప్పై వేలు

ఈ చేప రూ. ముప్పై వేలు

అరుదుగా దొరికే కలిచా (ఎర్రపండు చేప) ఆదివారం ప్రకాశం జిల్లా చీరాల ఓడరేవులో మత్స్యకారుల వలకు చిక్కింది.

చీరాల: అరుదుగా దొరికే కలిచా (ఎర్రపండు చేప) ఆదివారం ప్రకాశం జిల్లా చీరాల ఓడరేవులో మత్స్యకారుల వలకు చిక్కింది. శనివారం ఉదయం వేటకు వెళ్లిన గంగులు తన బృందంతో వేట చేస్తుండగా 25 కిలోల బరువున్న ఈ చేప గాలానికి చిక్కిందని మత్స్యకారులు తెలిపారు.

కేన్సర్, మెదడు సంబంధ వ్యాధులను నయం చేసే ఔషధాల తయారీలో ఈ చేపను ఎక్కువగా వినియోగిస్తుంటారని పేర్కొన్నారు. తీరం ఒడ్డున నిర్వహించిన వేలంలో బెంగళూరుకు చేపలను ఎగుమతి చేసే నాగేంద్ర అనే వ్యాపారి దీన్ని  రూ.30 వేలకు దక్కించుకున్నాడు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement