హౌరా నుంచి చెన్నై వెళ్తున్న మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లోని చివరి బోగీలో పొగలు రావడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు.
ద్వారపూడి: హౌరా నుంచి చెన్నై వెళ్తున్న మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లోని చివరి బోగీలో పొగలు రావడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. బుధవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. సాయంత్రం 5 గంటల సమయంలో రైలు ద్వారపూడి స్టేషన్ సమీపంలో ఉండగా వెనుక బోగీ చక్రాలు పట్టేయడంతో పొగలు లేచాయి.
ఓ ప్రయాణికుడు చైన్ లాగడంతో రైలు ఆగిపోయింది. ప్రయాణికులు భయంతో వెంటనే రైలు దిగిపోయారు. సిబ్బంది అక్కడకు చేరుకుని సమస్యను సరిచేసి రైలును పంపించేశారు. ఈ ఘటనలో రైలు సుమారు 20 నిమిషాల పాటు ఆగిపోయింది.


