విజయనగరం పట్టణంలోని సీడబ్ల్యూ మార్కెట్ ముత్యాలమ్మ గుడి సమీపంలో ఓ టింబర్ డిపోలో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది.
విజయనగరం పట్టణంలోని సీడబ్ల్యూ మార్కెట్ ముత్యాలమ్మ గుడి సమీపంలో ఓ టింబర్ డిపోలో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రారంభమైన మంటలకు డిపోలో ఉన్న కలప దగ్ధమైంది. సుమారు రూ.4 లక్షల వరకు ఆస్తి నష్టం కలిగినట్టు అంచనా. మంటలు విస్తరించకుండా అగ్నిమాపక సిబ్బంది నియంత్రించారు.