అగ్నిప్రమాదం: రూ.7 లక్షల ఆస్తి నష్టం | fire accident in medak | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదం: రూ.7 లక్షల ఆస్తి నష్టం

May 14 2017 3:26 PM | Updated on Oct 16 2018 3:12 PM

జిల్లాలోని జగదేవ్‌పూర్‌ మండలం గొల్లపల్లి గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది.

మెదక్‌: జిల్లాలోని జగదేవ్‌పూర్‌ మండలం గొల్లపల్లి గ్రామంలో గోపాల్ రెడ్డి ఇంట్లో షార్ట్ సర్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఇల్లు పూర్తిగా తగులబడింది. ఇంట్లో ఉంచిన రెండు క్వింటాళ్ల పత్తి, 100 డ్రిప్‌ పైపులు తగులబడ్డాయి. ఆయన బట్టల వ్యాపారం చేస్తుంటారు. బట్టలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం ఆస్తి నష్టం, సుమారు రూ.7 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపారు. మెదక్‌ నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పారు.

Advertisement
 
Advertisement
Advertisement