గ్యాస్‌ లీకై తాటాకిల్లు దగ్ధం | fire accident due gas leak | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ లీకై తాటాకిల్లు దగ్ధం

Apr 14 2017 11:54 PM | Updated on Sep 5 2017 8:46 AM

గ్యాస్‌ లీకై తాటాకిల్లు దగ్ధం

గ్యాస్‌ లీకై తాటాకిల్లు దగ్ధం

వెంకట్రామన్నగూడెం (తాడేపలి్లగూడెం రూరల్‌) : గ్యాస్‌ లీకై తాటాకిల్లు దగ్ధమైన ఘటన మండలంలోని వెంకట్రామన్నగూడెంలో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.

వెంకట్రామన్నగూడెం (తాడేపలి్లగూడెం రూరల్‌) : గ్యాస్‌ లీకై తాటాకిల్లు దగ్ధమైన ఘటన మండలంలోని వెంకట్రామన్నగూడెంలో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని జయ మహంకాళి పౌల్ట్రీ ఎదురుగా బత్తుల శ్రీనివాసరావు నివాసముంటున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం రాత్రి పనులు ముగించుకుని ఇంటిల్లిపాది నిద్రించారు. శుక్రవారం తెల్లవారు జామున గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు చూసి కేకలు పెట్టారు. ఈ హడావుడికి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు లేచి బయటకు పరుగులు తీశారు. అప్పటికే ఇంటితో పాటు బీరువాలోని రూ.2.50 లక్షల నగదు, ఇతర సామగ్రి, ఇంటి ఆవరణలోని పల్సర్‌ మోటారు సైకిల్‌ పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తం ఆస్తినష్టం సుమారు రూ.6.50 లక్షలు ఉంటుందని బాధితుడు శ్రీనివాసరావు వాపోయాడు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఇన్‌చార్జి ఫైరాఫీసర్‌ వి.భాస్కర్‌రాజు ఆధ్వర్యంలో మంటలను అదుపు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement