రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించండి | financil suport for poor former | Sakshi
Sakshi News home page

రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించండి

Jul 29 2016 1:27 AM | Updated on Aug 8 2018 5:54 PM

అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబానికి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన ఆర్థిక సహాయాన్ని సత్వరమే అందించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ను కోరారు. ఈ మేరకు ..

  • కలెక్టర్‌కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ లేఖ
కాకినాడ :
అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబానికి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన ఆర్థిక సహాయాన్ని సత్వరమే అందించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ను కోరారు. ఈ మేరకు ఆయన కలెక్టర్‌కు లేఖ రారు.  కలెక్టర్‌కు పంపించిన లేఖ వివరాలు ప్రకారం ... అల్లవరం మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన రైతు కొల్లా సత్యనారాయణ ఈ ఏడాది ఫిబ్రవరి 25న అప్పుల బాధ తాళ్ళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యపై జిల్లా యంత్రాంగం నియమించిన విచారణ కమిటీ నివేదికను వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌కు మే నెలలో అందజేశారు. ఆ మేరకు కొల్లా సూర్యనారాయణ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా గానీ, జిల్లా యంత్రాంగం నుంచి కానీ ఎలాంటి సహాయం అందలేదు. దీంతో అతని భార్య కె.వెంకటలక్ష్మి సమస్యను వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు జున్నూరి రామారావు(బాబి) ద్వారా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో స్పందించిన జగన్‌ తక్షణమే ఆ కుటుంబానికి ప్రభుత్వపరంగా అందాల్సిన ఆర్థిక సహాయాన్ని అందజేయాల్సిందిగా కోరుతూ కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌కు లేఖ రాశారు. జగన్‌ పంపిన లేఖను∙సత్యనారాయణ కుమారుడు కొల్లా బాబి గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయానికి అందజేశారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement