కృష్ణాజిల్లా గన్నవరంకు చెందిన ఓ ఫాస్టర్ అమెరికాలో అదృశ్యం అయిన ఘటన కలకలం రేపుతోంది.
హైదరాబాద్: కృష్ణాజిల్లా గన్నవరంకు చెందిన ఓ ఫాస్టర్ అమెరికాలో అదృశ్యం అయిన ఘటన కలకలం రేపుతోంది. ఫాదర్ వీరపనేని జాన్సన్ చౌదరి గత నెలలో అమెరికాకు వెళ్లాడు. షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ నెల 13న భారత్‌కు తిరిగిరావాల్సి ఉండగా.. ఇప్పటివరకు తిరిగిరాలేదు. ఫాదర్ జాన్సన్ చౌదరి ఆచూకీ తెలియక పోవటంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు.