వివాహిత దీక్ష | Fast women | Sakshi
Sakshi News home page

వివాహిత దీక్ష

Mar 3 2017 12:13 AM | Updated on Sep 5 2017 5:01 AM

వివాహిత దీక్ష

వివాహిత దీక్ష

అత్త, భర్త వేధిస్తున్నారంటూ ఓ వివాహిత దీక్షకు కూర్చొన్న సంఘటన మైలవరం మండలం దొమ్మరనంద్యాల గ్రామంలో గురువారం చోటుచేసుకొంది.

మైలవరం: అత్త,  భర్త వేధిస్తున్నారంటూ  ఓ వివాహిత దీక్షకు కూర్చొన్న సంఘటన దొమ్మరనంద్యాల గ్రామంలో గురువారం చోటుచేసుకొంది. ఇందుకు సంభందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామానికి చెందిన పల్లా గోపాల్, ధనలక్ష్మి కుమార్తె రాజేశ్వరిని మైలవరం మండలం దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన బడిగించాల వెంకటసుబ్బయ్య సంవత్సరం క్రితం వివాహం చేసుకొన్నాడు. మొదటి ఆరు నెలలు  సంసారం సజావుగా సాగింది. తర్వాత రాజేశ్వరికి   వేధింపులు మెదలయ్యాయి., దీంతో ఆమె తనకు న్యాయం చేయాలంటూ మైలవరం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు న్యాయం చేయలేదని బుధవారం రాత్రి  తల్లి, తండ్రి, సోదరుడుతో కలిసి దొమ్మరనంద్యాలలోని వనంలోని చౌడేశ్వరి గుడి దగ్గర దీక్షకు కూర్చున్నారు.
పెద్ద మనుషుల చర్చలు విఫలం :
గ్రామానికి చెందిన కొందరు పెద్దమనుషులు గురువారం ఉదయం అబ్బాయి తరఫు వారితో మాట్లాడి  సయోధ్య కుదురుస్తామని అమ్మాయి బుంధువులతో చెప్పారు. తమ కుమార్తెను వేధించిన వారిపై కేసు నమోదు చేయాలని, అంతవరకు దీక్ష విరమించేది లేదన్నారు.  మధ్యాహ్నం వరకు సాగిన పెద్ద మనుషుల చర్చలు విఫలమయ్యాయి.
కేసు నమోదు చేసిన రూరల్‌ సీఐ
 దీక్ష విషయం పోలీసులకు ఉదయమే తెలిసినా ఫ్యాక‌్షన్‌ గ్రామమైన చిన్నకొమెర్లలో పెద్దమ్మ జాతరకు బందోబస్తు కోసం వెళ్లారు. రాత్రి రూరల్‌ సీఐ మురళీనాయక్, మైలవరం ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌రెడ్డి  రాజేశ్వరితో మాట్లాడారు. అనంతరం వెంకటసుబ్బయ్య అతని తల్లి మరి కొందరిపై  కేసు నమోదు చేశారు. దీంతో  రాత్రి 9 గంటల సమయంలో ఆమె దీక్ష విరమించింది.
ఇంటికి వస్తే కాపురం చేస్తా:–
    రాజేశ్వరిని  వేధింపులకు గురి చేయలేదు. తల్లిని వదిలేసి వేరు  కాపురం పెట్టాలని   బలవంతం చేస్తోంది. దీనికి నేను అంగీకరించలేదు. దీంతో ఆమె చెప్పుడు మాటలు విని
మాపై కేసు పెట్టింది. ఇప్పటికైనా ఆమె నా ఇంటికి వస్తే కాపురం చేస్తాను.
    – వెంకటసుబ్బయ్య,

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement