విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి | Farmer killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

Jul 7 2016 10:03 AM | Updated on Sep 5 2018 2:26 PM

విద్యుత్‌ షాక్‌తో ఓ రైతు దుర్మరణం చెందిన సంఘటన కరీంనగర్‌ జిల్లా వేములవాడ మండలం అయ్యోరుపల్లిలో గురువారం జరిగింది.

విద్యుత్‌ షాక్‌తో ఓ రైతు దుర్మరణం చెందిన సంఘటన కరీంనగర్‌ జిల్లా వేములవాడ మండలం అయ్యోరుపల్లిలో గురువారం జరిగింది. అయ్యోరుపల్లికి చెందిన తేలు మల్లేశం గురువారం తెల్లవారు జామున తన పొలానికి వెళ్లాడు. కరెంట్‌ మోటారు ఆన్‌ చేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. విద్యుత్‌ షాక్‌తో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement