విద్యుదాఘాతంతో రైతు మృతి | farmer died by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Jun 23 2017 11:46 PM | Updated on Oct 2 2018 6:42 PM

బురాన్‌దొడ్డి గ్రామానికి చెందిన రైతు రామాంజినేయులు (36) విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

 
సి.బెళగల్‌: బురాన్‌దొడ్డి గ్రామానికి చెందిన రైతు రామాంజినేయులు (36) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. తనకున్న ఎకరన్నర పొలంలో ఉల్లి పంటను సాగు చేశాడు. గురువారం ఉల్లిపంటకు నీళ్లు పెట్టేందుకు పొలానికెళ్లిన రామాంజినేయులు మధ్యాహ్నం 12.15 గంటలకు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద త్రీ ఫేస్‌ విద్యుత్‌ను సింగల్‌ ఫేస్‌గా మార్చే ప్రయత్నం  చేశాడు. ఈ క్రమంలో విద్యుత్‌ తీగ యువ రైతు మీద పడడంతో అక్కడిక్కకడే మృతి చెందాడు. మృతుడికి భార్య సువర్ణ, కుమార్తె ఉషారాణి (5వ తరగతి), కుమారుడు గోపిచంద్‌ (3వ తరగతి) ఉన్నారు. విద్యుత్‌ ప్రమాదంతో రైతు మృతి చెందిన విషయం తెలుసుకున్న కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైఎసార్‌సీపీ కోడుమూరు సమన్వయ కర్త మురళీకృష్ణ గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement