అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer commits suicide in medak district | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Feb 5 2016 1:02 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధ తాళలేక అన్నదాత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం ముభారస్‌పూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

దౌల్తాబాద్: అప్పుల బాధ తాళలేక అన్నదాత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం ముభారస్‌పూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శేరిపల్లి నర్సింహులు(50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారికానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement