గ్రామీణ ప్రాంతాల్లో సేవలు ప్రశంసనీయం | eye institute work good | Sakshi
Sakshi News home page

గ్రామీణ ప్రాంతాల్లో సేవలు ప్రశంసనీయం

Aug 27 2016 9:25 PM | Updated on Sep 4 2017 11:10 AM

గ్రామీణ ప్రాంతాల్లో సేవలు ప్రశంసనీయం

గ్రామీణ ప్రాంతాల్లో సేవలు ప్రశంసనీయం

గ్రామీణ ప్రాంతాల్లో సెంటర్లను ప్రారంభించి పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా నేత్ర వైద్యసేవలను ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ అందించడం ప్రశంసనీయమని పలువురు వక్తులు కొనిడాయారు. కపిలేశ్వరపురంలో శనివారం ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో గొడవర్తి సత్యనారాయణమూర్తి సెకండరీ ఐ సెంటర్‌ను ప్రారంభించారు.

  • ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ సేవలను కొనియాడిన ప్రముఖులు
  • కపిలేశ్వరపురంలో సెకండరీ ఐ సెంటర్‌ ప్రారంభం
  • కపిలేశ్వరపురం :  
    గ్రామీణ ప్రాంతాల్లో సెంటర్లను ప్రారంభించి పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా నేత్ర వైద్యసేవలను ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ అందించడం ప్రశంసనీయమని పలువురు వక్తులు కొనిడాయారు. కపిలేశ్వరపురంలో శనివారం ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో గొడవర్తి సత్యనారాయణమూర్తి సెకండరీ ఐ సెంటర్‌ను ప్రారంభించారు. సంస్థ చైర్మన్‌ జీఎన్‌ రావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు, ఎన్‌ఏఎస్‌సీఓఎం చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, శ్రీ సర్వారాయ సుగర్స్‌ ఎండీ ఎస్‌బీపీఎస్‌ కృష్ణమోహన్, అమలాపురం, రాజమండ్రి ఎంపీలు పండుల రవీంద్రబాబు, ఎం.మురళీమోహన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆస్పత్రిలోని పలు విభాగాలను ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రి ఆవర ణలో ప్రగతి ఇంజనీరింగ్‌ కళాశాల చైర్మన్‌ పరుచూరి కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జీఎన్‌రావు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో మూడు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో 16 సంస్థలను స్థాపించి గ్రామీణుల నేత్ర పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. సంస్థల ఏర్పాటుకు సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కామినేని మాట్లాడుతూ ఎల్‌వీ ప్రసాద్‌ సంస్థ గ్రామీణప్రాంతాలవారికి మెరుగైన సేవలందించడం అభినందించదగినదన్నారు. బీవీఆర్‌ మోహనరావు మాట్లాడుతూ వ్యక్తి ఏ స్థాయికి ఎదిగినా సమాజం కోసం కృషి చేయడమే జీవితలక్ష్యంగా భావించాలన్నారు. ఎంపీలు మురళీమోహన్, పండుల రవీంద్రబాబు, సర్వారాయ సుగర్స్‌ ఎండీ కృష్ణమోహన్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ చేస్తున్న కృషిని కొనియాడారు. ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఇలాంటి సంస్థ స్థాపించడం అభినందనీయమన్నారు. సర్పంచ్‌ మునిప్రసాద్, ఎంపీపీ కె. వెంకటరాంబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వీర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు జె.సూర్యావతి, ప్రముఖులు వి.సాయికుమార్‌బాబు, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌∙రెడ్డి ప్రసాద్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement