పేరుకే ఉల్లిగడ్డల లారీ, కానీ.. | excise officers seized alcohal at warangal district | Sakshi
Sakshi News home page

పేరుకే ఉల్లిగడ్డల లారీ, కానీ..

May 16 2016 3:47 PM | Updated on Aug 17 2018 7:44 PM

పేరుకు ఉల్లిగడ్డల లారీ..కానీ అందులో ఉండేది మద్యం బాటిల్స్..

వరంగల్: పేరుకు ఉల్లిగడ్డల లారీ..కానీ అందులో ఉండేది మద్యం బాటిల్స్.. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు వెళ్తున్న లారీని తనిఖీ చేయగా బయటపడిన విషయమిది. సోమవారం ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అందులో మద్యం, మద్యం తయారీ సామగ్రి బయటపడింది. మెత్తం ఆరు టన్నుల నల్లబెల్లం, 5 క్వింటాళ్ల పటిక, 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement