శిశువు మృతిపై వైద్యాధికారుల విచారణ | enquiry on infant death | Sakshi
Sakshi News home page

శిశువు మృతిపై వైద్యాధికారుల విచారణ

Sep 3 2016 1:48 AM | Updated on Oct 9 2018 7:52 PM

వేల్పూరు (తణుకు టౌన్‌) : తణుకు మండలం వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇటీవల శిశువు మృతి ఘటనపై శుక్రవారం అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌వో ఉమాదేవి విచారణ చేపట్టారు.

వేల్పూరు (తణుకు టౌన్‌) : తణుకు మండలం వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇటీవల శిశువు మృతి ఘటనపై శుక్రవారం అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌వో ఉమాదేవి విచారణ చేపట్టారు. వేల్పూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ఆమె శిశువు తల్లిదండ్రులు పోలుమాటి ప్రమోద్, లిల్లీడాలీలను ప్రశ్నించి వివరాలు నమోదు చేసుకున్నారు. అదే సమయంలో పీహెచ్‌సీ వైధ్యాదికారిని, ఇతర సిబ్బందిని విచారించారు. అనంతరం తణుకులోని ప్రైవేట్‌ ఆస్పత్రిలోని సిబ్బందిని విచారించారు. వివరాలను నమోదు చేసుకుని నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. ఈ విచారణలో తణుకు ఏరియా ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్‌ అరుణ, పిల్లల వైద్యులు సత్యనారాయణ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement