ఉల్లాసంగా...ఉత్సాహంగా | enjoy.. enjoy | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా...ఉత్సాహంగా

Aug 1 2016 10:09 AM | Updated on Sep 4 2017 7:13 AM

మహిళల రన్నింగ్‌

మహిళల రన్నింగ్‌

కరీంనగర్‌ సిటీ : కరీంనగర్‌లోని ఉజ్వల పార్క్‌ ఆదివారం చిన్నారుల కేరింతలు.. మహిళల ఆటలు..పురుషుల నృత్యాలతో హోరెత్తింది.

కరీంనగర్‌ సిటీ : కరీంనగర్‌లోని ఉజ్వల పార్క్‌ ఆదివారం చిన్నారుల కేరింతలు.. మహిళల ఆటలు..పురుషుల నృత్యాలతో హోరెత్తింది. ఎల్లాపి కులస్తులు ఏర్పాటుచేసుకున్న వనమహోత్సవం కన్నులపండువగా సాగింది. దాదాపు 300 కుటుంబాలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. రన్నింగ్, కబడ్డీ, ఖోఖో, త్రోబాల్, మ్యూజికల్‌ చైర్, డ్యాన్స్‌ తదితర విభాగాల్లో పోటీపడ్డారు. కరీంనగర్‌ యూనిట్‌ అధ్యక్షుడు వి.గణేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి లక్కాకుల సురేందర్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాసరావు, ఆర్టీసీ జగిత్యాల డిపో మేనేజర్‌ పారువెల్ల హన్మంతరావు, తుల అనూషను ఘనంగా సన్మానించారు.

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కరాలు అందించారు. ఎల్లాపి సంఘం మాజీ అధ్యక్షుడు లక్కాకుల మనోహర్‌రావు, కార్పొరేటర్‌ తాటి ప్రభావతి, వేల్ముల వెంకటేశ్వర్‌రావు, ఆది జలపతిరావు, తాటి వేణుగోపాల్‌రావు, బాలసంకుల అనంతరావు, వి.బాలకిషన్‌రావు, గందె కల్పన విశ్వేశ్వర్‌రావు, లక్కాకుల మోహన్‌రావు, ఆది కొండాల్‌రావు, భాస్కర్‌రావు, ఆది రమణారావు, సర్పంచ్‌లు ఆది మధుసూదన్‌రావు, జి.లత శ్రీనివాస్‌రావు, రాజన్న తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement