50 క్వింటాళ్ల నువ్వులు స్వాధీనం | Enforcement raids | Sakshi
Sakshi News home page

50 క్వింటాళ్ల నువ్వులు స్వాధీనం

Aug 1 2016 11:02 PM | Updated on Sep 4 2017 7:22 AM

శ్రీకాకుళం రీజనల్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం రాత్రి పార్వతీపురం పట్టణంలో దాడులు నిర్వహించారు.

పార్వతీపురం: శ్రీకాకుళం రీజనల్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం రాత్రి పార్వతీపురం పట్టణంలో దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక నవిరి కాలనీలో అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్న తెల్ల ఈశ్వర్రావు అక్రమంగా నిల్వ ఉంచిన 50 క్వింటాళ్ల నువ్వుల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ ఎస్సై అప్పలనాయుడు మాట్లాడుతూ సమాచారం మేరకు దాడులునిర్వహించి, అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన నువ్వులను స్వాధీనం చేసుకున్నామన్నారు. వారి వెంట స్థానిక సీఎస్‌డీటీ ఆవాల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement