‘కరి’గిపోతున్న ఆశలు | Sakshi
Sakshi News home page

‘కరి’గిపోతున్న ఆశలు

Published Fri, Sep 30 2016 11:11 PM

‘కరి’గిపోతున్న ఆశలు

కొత్తూరు: ఏనుగుల వల్ల వరి రైతుల ఆశలు కరిగిపోతున్నాయి. ఇంత వరకు ఎల్‌ఎన్‌పేట, బూర్జ మండలాల సరిహద్దుల్లో ఉన్న ఏనుగులు గురువారం రాత్రి మండలంలోని నీలకంఠాపురం సమీపం సంకిలికొండలు మీదుగా పంటపొలాల్లోకి చొరబడ్డాయి. నీలకంఠాపురంలోని కె.వెంకటరావు, రవిలతో పాటు పలు రైతులకు చెందిన సుమారు మూడు ఎకరాల్లో ఉన్న చిరు పొట్ట దశలో వరి చేనును నాశనం చేశాయి. పంట పొలాల్లో వర్షం నీరు ఎక్కువగా ఉండడంతో ఏనుగులు ధ్వంసం చేసిన వరి పైరు పనికి రాకుండా పోయింది.
 
అలాగే కొంత మంది రైతులకు చెందిన ఎద వరి పొలాలను కూడా ఇవి నాశనం చేశాయి. వెన్ను దశలో నష్టం వాటిల్లడంతో రైతు కోలుకోవడం కష్టమవుతోంది. ప్రభుత్వం స్పదించి నష్టపోయిన పంటలకు పరిహారం అందివ్వాలని రైతులుతో పాటు మెట్టూరు పీఏసీఎస్‌ మాజీ ఉపాధ్యక్షుడు బూర్లె శ్రీనివాసరావు, గొంటి రమేష్‌లు కోరుతున్నారు.  

Advertisement
Advertisement