ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల గుర్తులు ఖరారు | election symbles ulerted | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల గుర్తులు ఖరారు

Aug 25 2016 10:23 PM | Updated on Sep 4 2017 10:52 AM

ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికల్లో భాగంగా గురువారం యూనియన్లకు గుర్తులు కేటాయించారు.

జ్యోతినగర్‌ : ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికల్లో భాగంగా గురువారం యూనియన్లకు గుర్తులు కేటాయించారు. పోటీలో ఉన్న ఎన్టీపీసీ మజ్దూర్‌ యూనియన్‌(ఐఎన్టీయూసీ)కి చేతిలో చేయి గుర్తు, ఎన్టీపీసీ డెమోక్రటిక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(హెచ్‌ఎంఎస్‌)కు స్కూటర్‌ గుర్తు, ఎన్టీపీసీ కార్మిక సంఘ్‌(బీఎంఎస్‌)కు గులాబీ పువ్వు, ఎన్టీపీసీ తెలంగాణ కార్మిక సంఘంకు పులి గుర్తు కేటాయించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement