సమాచారం పంపండి | election commission letter to The district administration | Sakshi
Sakshi News home page

సమాచారం పంపండి

Mar 20 2017 11:15 PM | Updated on Aug 14 2018 4:34 PM

సమాచారం పంపండి - Sakshi

సమాచారం పంపండి

నియోజకవర్గాల సమగ్ర సమాచారం నివేదించాలని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) జిల్లా యంత్రాంగానికి లేఖ రాసింది.

► నియోజకవర్గాల పరిధిలో గ్రామాల జాబితా ఇవ్వండి
► జిల్లా యంత్రాంగానికి కేంద్ర ఎన్నికల కమిషన్  లేఖ


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నియోజకవర్గాల సమగ్ర సమాచారం నివేదించాలని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) జిల్లా యంత్రాంగానికి లేఖ రాసింది. ఆయా నియోజకవర్గాల పరిధిలోకి ఏయే మండలాలు, గ్రామాలు వస్తాయనే వివరాలను తక్షణమే పంపాలని ఆదేశించింది. అదే పట్టణ నియోజకవర్గాలయితే.. వార్డుల హద్దుల సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు అదనపు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ అనూప్‌సింగ్‌ లేఖ రాశారు.

నియోజకవర్గాల పునర్విభజనను నిర్వచిస్తూ లేఖలో రాసినప్పటికీ, ఇది రొటీన్ లో భాగంగా జరుగుతున్న ప్రక్రియ మాత్రమేనని అధికారవర్గాలంటున్నాయి. ఇదిలా ఉండగా, ఈసీ అడిగిన సమాచారాన్ని తక్షణమే పంపాలని ఆర్డీఓ, తహసీల్దార్లను జిల్లా యంత్రాంగం ఆదేశించింది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో నియోజకవర్గాల్లో కొన్ని మండలాలు వేర్వేరు జిల్లాల్లో కలిసినందున.. దానికి అనుగుణంగా సమాచారాన్ని సేకరించాలని నిర్దేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement