సైకో వీరంగం.. 8 మందికి గాయాలు | eight injured in psycho knife attack | Sakshi
Sakshi News home page

సైకో వీరంగం.. 8 మందికి గాయాలు

Oct 14 2016 10:35 PM | Updated on Sep 4 2017 5:12 PM

విశాఖ జిల్లాలో ఓ సైకో వీరంగం చేశాడు. జిల్లాలోని కంచరపాలెంలో చేతిలో కత్తితో సైకో వీర విహారం చేస్తూ.. శుక్రవారం చాలా మందిపై దాడికి పాల్పడ్డాడు.

విశాఖపట్నం: విశాఖ జిల్లాలో ఓ సైకో వీరంగం చేశాడు. జిల్లాలోని కంచరపాలెంలో చేతిలో కత్తితో సైకో వీర విహారం చేస్తూ.. శుక్రవారం చాలా మందిపై దాడికి పాల్పడ్డాడు. కత్తితో సైకో దాడికి పాల్పడటంతో దాదాపు ఎనిమిది మంది గాయపడ్డారు. దీంతో భయాందోళనలకు గురైన కంచరపాలెం గ్రామస్తులు సైకో గురించి పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు సైకోను అదుపులోకి తీసుని విచారణ చేస్తున్నారు. అతడి వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే దాడి చేశాడా.. లేక అతడు నిజంగానే సైకోనా అని అన్నికోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement