దుర్గ గుడి ఘాట్‌రోడ్డు మూసివేత | Durga temple ghat road closed | Sakshi
Sakshi News home page

దుర్గ గుడి ఘాట్‌రోడ్డు మూసివేత

Jun 6 2016 9:38 AM | Updated on Sep 4 2017 1:50 AM

ఇంద్రకీలాద్రి ఆధునికీకరణ పనుల్లో భాగంగా భక్తులు కొండపైకి చేరుకునే ఘాట్‌రోడ్డును అధికారులు సోమవారం మూసివేశారు.

విజయవాడ: ఇంద్రకీలాద్రి ఆధునికీకరణ పనుల్లో భాగంగా భక్తులు కొండపైకి చేరుకునే ఘాట్‌రోడ్డును అధికారులు సోమవారం మూసివేశారు. ఇప్పటికే అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని భవాని దీక్ష మండపం పరిపాలన విభాగం భవనాలను పూర్తిగా తొలగించారు. సోమవారం నుంచి ఘాట్‌రోడ్డును మూసివేసిన అధికారులు భక్తులను మహా మండపం మీదుగా అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. కొండపైన అన్నదాన భవనాన్ని కూడా తరలించిన అధికారులు శృంగేరి పీఠంలో నూతన అన్నదాన భవనాన్ని ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement