దుర్గా దివ్య దర్శన్‌ యాత్ర | durga divya darshan tour | Sakshi
Sakshi News home page

దుర్గా దివ్య దర్శన్‌ యాత్ర

Nov 6 2016 10:50 PM | Updated on Jul 29 2019 6:06 PM

దుర్గా దివ్య దర్శన్‌ యాత్ర - Sakshi

దుర్గా దివ్య దర్శన్‌ యాత్ర

విజయవాడ–గుంటూరు (కాజా) మధ్య ఆలయాలను సందర్శించేలా దుర్గగుడి దేవస్థానం రూపొందించిన దుర్గా దివ్య దర్శన్‌ యాత్రను దుర్గగుడి ఈవో సూర్యకుమారి ఆదివారం ప్రారంభించారు.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) :  విజయవాడ–గుంటూరు (కాజా) మధ్య ఆలయాలను సందర్శించేలా దుర్గగుడి దేవస్థానం రూపొందించిన దుర్గా దివ్య దర్శన్‌ యాత్రను దుర్గగుడి ఈవో సూర్యకుమారి ఆదివారం ప్రారంభించారు. తొలుత టోల్‌గేటు సమీపంలోని కామధేను అమ్మవారి వద్ద  యాత్ర బస్సుకు దుర్గగుడి ఈవో పూజలు నిర్వహించారు. అనంతరం యాత్రికులతో కలిసి ఈవో సూర్యకుమారి బస్సులో కొండపై అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అమ్మవారి దర్శించుకున్న యాత్రికులకు ప్రసాదాలను అందజేశారు. తొలి రోజున 16 సిట్టింగ్‌ బస్సు ఏర్పాటు చేయగా 11 మంది యాత్రలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దర్శనం అనంతరం పొలకంపాడు శివాలయం,   తాడేపల్లిలోని నక్షత్రవన సందర్శనం, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం,  సీతానగరం మద్వీరాంజనేయ స్వామి ఆలయం, శ్రీకృష్ణ మందిర సందర్శనంతో యాత్ర ముగిసింది.  



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement