వరసిద్ధునికి రూ.2లక్షల విరాళం | donate 2 lacks vasiddi vinayaka | Sakshi
Sakshi News home page

వరసిద్ధునికి రూ.2లక్షల విరాళం

Jul 26 2016 10:47 PM | Updated on Sep 4 2017 6:24 AM

విరాళం అందజేస్తున్న దాత

విరాళం అందజేస్తున్న దాత

కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారికి మంగళవారం ఓ భక్తుడు రూ.2,00,116 విరాళంగా అందజేశారు. నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష, స్వామి వారి సేవలకు 1,00,116 రూపాయలను గుంటూరుకు చెందిన మణికంఠ డీడీ రూపంలో ఏఈఓ కేశవరావుకు ఈ విరాళం అందజేశారు.

 
ఐరాల :  కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారికి మంగళవారం ఓ భక్తుడు రూ.2,00,116 విరాళంగా అందజేశారు. నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష, స్వామి వారి సేవలకు 1,00,116 రూపాయలను గుంటూరుకు చెందిన మణికంఠ డీడీ రూపంలో ఏఈఓ కేశవరావుకు ఈ విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాలతో స్వామి వారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం  మూషిక మండపంలో వేదపండితుల ఆశీర్వచనం పలికి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు పలువురు పాల్గొన్నారు.
 
 
వినాయకుని సన్నిధిలో కన్నా లక్ష్మీనారాయణ
 
కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామిని  మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. స్వామి వారి ప్రత్యేక దర్శనం, వేదపండితులు ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాలను అందజేశారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement