రేపు లైవ్‌లో మహాదేవుని కల్యాణం | World Will Be Able To Watch Live Of Kashi Vishwanath Live Darshan, Check Timings Details Inside - Sakshi
Sakshi News home page

Mahashivratri 2024: రేపు లైవ్‌లో మహాదేవుని కల్యాణం

Published Thu, Mar 7 2024 12:36 PM

World Will be Able Have Baba Vishwanath Live Darshan - Sakshi

రేపు (శుక్రవారం) మహా శివరాత్రి సందర్భంగా యూపీలోని కాశీలో మహాదేవుని కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను భక్తులు తమ మొబైల్‌ ఫోన్లలో ప్రత్యక్షంగా చూడవచ్చు. కాశీ విశ్వనాథ దేవాలయం ట్రస్ట్.. మార్చి 8న మంగళ హారతి నుండి మార్చి 9 న భోగ్ హారతి వరకు మొత్తం 36 గంటల పాటు అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారాలలో నాన్‌స్టాప్ లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. 

మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది  కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు 10 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని ట్రస్ట్‌ అంచనా వేస్తోంది. వికలాంగులు, వృద్ధులు సులభంగా దర్శనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

గత ఏడాది మహాశివరాత్రి సందర్భంగా సుమారు 8 లక్షల మంది భక్తులు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్నారని, ఈసారి ఆ సంఖ్య 10 లక్షలు దాటే అవకాశం ఉందని ట్రస్ట్‌ సభ్యులు చెబుతున్నారు. వారణాసిలోని అస్సీ ఘాట్, దశాశ్వమేధ్ ఘాట్, వారణాసి కాంట్ రైల్వే స్టేషన్ ఇతర ప్రధాన ప్రదేశాలలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడి నుంచి ప్రత్యక్ష దర్శనాన్ని ప్రసారం చేయనున్నమని తెలిపారు.

Advertisement
 
Advertisement