
పెనుకొండలో పిచ్చికుక్క స్వైరవిహారం
పెనుకొండలో ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. అడ్డొచ్చిన వారందరినీ కరచి గాయపరిచింది.
- ఐదుగురిని గాయపరచిన వైనం
- భయభ్రాంతులకు గురైన జనం
పెనుకొండ : పెనుకొండలో ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. అడ్డొచ్చిన వారందరినీ కరచి గాయపరిచింది. వారిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక బోయపేటలోకి గురువారం వచ్చిన పిచ్చికుక్క రోడ్డెంట కాలినడకన వెళ్తున్న బోయ బాబయ్య(65)పై దాడి చేసింది. అతన్ని తీవ్రంగా గాయపరిచింది. ఆ తరువాత గోవిందు భార్య రాధతో పాటు కుమారుడు బాబు(3)నూ తీవ్రంగా గాయపరచింది.
ఆ తరువాత జయమ్మ, తిప్పమ్మ అనే మహిళలపైనా తన ప్రతాపం చూపింది. విషయం క్షణాల్లో అందరికీ తెలిసిపోవడంతో పిచ్చికుక్కను చంపేందుకు స్థానికులు ప్రయత్నించారు. అయితే వారి కంటికి అది కనిపించలేదు. దీంతో బోయపేట, అర్బన్ కాలనీ, దర్గాపేటలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.