జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు ప్రారంభం | dist level batminton sports started | Sakshi
Sakshi News home page

జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు ప్రారంభం

Sep 10 2016 8:17 PM | Updated on Sep 4 2017 12:58 PM

జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు ప్రారంభం

జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు ప్రారంభం

దేవరకొండ : దేవరకొండ స్పోర్ట్స్‌ అసోసియేషన్, బ్యాడ్మింటన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు శనివారం డీఎస్పీ ఎంజీ. చంద్రమోహన్‌ ప్రారంభించారు.

దేవరకొండ : దేవరకొండ స్పోర్ట్స్‌ అసోసియేషన్, బ్యాడ్మింటన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు శనివారం డీఎస్పీ ఎంజీ. చంద్రమోహన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతమైన దేవరకొండలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గానూ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం కొద్దిసేపు డీఎస్పీ బ్యాడ్మింటన్‌ ఆడారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఎన్‌వీటీ, తాళ్ల శ్రీధర్‌గౌడ్, కాశిమల్ల భాస్కర్, కృష్ణకిషోర్, తాళ్ల సురేష్, పంతులాల్, బాబా, ఖాలేక్, సురేష్, శేఖర్, వెంకట్‌ పాల్గొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement