అతిసారతో వ్యక్తి మృతి | diahria killed | Sakshi
Sakshi News home page

అతిసారతో వ్యక్తి మృతి

Jul 25 2016 11:55 PM | Updated on Sep 4 2017 6:14 AM

గుమ్మపాడు పంచాయతీ గోపాలపురం గ్రామంలో అతిసారతో వృద్ధుడు యజ్జల లచ్చయ్య మృతి చెందగా పలువురు బాధపడుతున్నారు. యజ్జల లచ్చయ్యకు నాలుగు రోజుల క్రితం అతిసారం సోకి బుడితి సీహెచ్‌సీలో వైద్య సేవలు పొంది ఆదివారం ఇంటికి చేరుకున్నాడు. సోమవారం మృతి చెందాడు.

గోపాలపురం (సారవకోట) : గుమ్మపాడు పంచాయతీ గోపాలపురం గ్రామంలో అతిసారతో వృద్ధుడు యజ్జల లచ్చయ్య మృతి చెందగా  పలువురు బాధపడుతున్నారు. యజ్జల లచ్చయ్యకు నాలుగు  రోజుల క్రితం అతిసారం సోకి బుడితి సీహెచ్‌సీలో వైద్య సేవలు పొంది ఆదివారం ఇంటికి  చేరుకున్నాడు. సోమవారం మృతి చెందాడు. ఈయనకు భార్య చిన్నమ్మి, ఇద్దరు కుమార్తెలు, కుమారులున్నారు.  గ్రామానికి చెందిన ముచ్చ లచ్చమ్మ, బొమ్మాళి గన్నెమ్మ, శిమ్మ అన్నపూర్ణ, పొట్నూరు సుశీలతో పాటు మరో ఆరుగురు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. వీరిలో ఇద్దరిని నరసన్నపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మిగిలిన వారు గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వైద్య సేవలు పొందారు.  గ్రామంలో పారిశుధ్య లోపం వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయని స్థానికులు తెలిపారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement