ఆందోళనకారులను శాంతింపజేస్తున్న పోలీసులు
మద్దుకూరు గ్రామానికి చెందిన బొగ్గుటిప్పర్ డ్రైవర్ కొడెం శ్రీకాంత్ (22) ఆత్మహత్య ఉదంతం రాద్దాంతంగా మారింది. ఆదివారం మృతుడి కుటుంబీకులు, గ్రామస్తులు మూకుమ్మడిగా వచ్చి చండ్రుగొండ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.
-
పోలీస్‌స్టేషన ఎదుట మృతుడి బంధువుల ఆందోళన
చండ్రుగొండ: మద్దుకూరు గ్రామానికి చెందిన బొగ్గుటిప్పర్ డ్రైవర్ కొడెం శ్రీకాంత్ (22) ఆత్మహత్య ఉదంతం రాద్దాంతంగా మారింది. ఆదివారం మృతుడి కుటుంబీకులు, గ్రామస్తులు మూకుమ్మడిగా వచ్చి చండ్రుగొండ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దలు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు.
మద్దుకూరుకు చెందిన లారీడ్రైవర్ కొడెం శ్రీకాంత్, అయన్నపాలెం గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు గతంలోనే చనిపోవడంతో..మేనమామ ముత్తయ్య ఇంట్లో ఉంటున్నాడు. శ్రీకాంత్‌తో పెళ్లికి నిరాకరించిన బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గత శుక్రవారం ఫిర్యాదు చేయడంతో..విచారణ నిమిత్తం పిలిపించి..పూచికత్తుపై వదిలేశారు. అయితే..శ్రీకారత్ శనివారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగగా..గమనించిన పోలీసులు కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి మరణించాడు.
-
పోలీసుల వేధింపులే కారణమంటూ..
పోలీసుల వేధింపుల కారణంగానే శ్రీకాంత్ చనిపోయాడని అతడి బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగడంతో..ఇక్కడ ఉత్కంఠ నెలకొంది. ఆత్మహత్యకు కారణమైన పోలీసులపై చర్య తీసుకోవాలని ఆగ్రహించారు. ఈ విషయమై జూలూరుపాడు సీఐ నాయుడు మల్లయ్యస్వామిని ‘సాక్షి’ని వివరణ కోరగా..కేవలం విచారణ కోసమే పిలిపించామని, తామేం వేధించలేదని తెలిపారు. ఆందోళన నేపథ్యంలో జూలూరుపాడు సీఐ ఆధ్వర్యంలో కొత్తగూడెం టూటౌన్, పాల్వంచ సీఐ శ్రీనివాసరాజు, స్యతనారాయణరెడ్డి, ఏన్కూర్, పాల్వంచ, ముల్కలపల్లి, చండ్రుగొండ ట్రైనీ ఎస్‌ఐలు సంజీవ్, శ్రీనివాస్‌కుమార్, తిరుపతి, వంశీధర్, స్పెషల్‌పార్టీ పోలీసులు బందోబస్తు నిర్వహంచారు.