పోటెత్తిన మద్దిలేటి క్షేత్రం | devotees waves at maddilety | Sakshi
Sakshi News home page

పోటెత్తిన మద్దిలేటి క్షేత్రం

Jun 3 2017 11:29 PM | Updated on Oct 1 2018 2:09 PM

పోటెత్తిన మద్దిలేటి క్షేత్రం - Sakshi

పోటెత్తిన మద్దిలేటి క్షేత్రం

శ్రీ లక్ష్మీ మద్దిలేటి నరసింహస్వామి క్షేత్రం.. శనివారం భక్తులతో పోటెత్తింది. వైశాఖ మాసాన్ని పురస్కరించుకొని రైతులు ప్రత్యేక పూజలు చేశారు.

బేతంచెర్ల: శ్రీ లక్ష్మీ మద్దిలేటి నరసింహస్వామి క్షేత్రం.. శనివారం భక్తులతో పోటెత్తింది. వైశాఖ మాసాన్ని పురస్కరించుకొని రైతులు ప్రత్యేక పూజలు చేశారు. వేకువజాము నుంచే ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామి వార్లకు అభిషేకం, కుంకుమార్చన, వరపూజ, ఆకుపూజ నిర్వహించారు. సుమారు నాలుగువేల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.  
వెండి పూలహారం సమర్పణ 
వైఎస్సార్‌ కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన వెంకట శేషఫణి కుటుంబ సభ్యులు శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామికి మొక్కుబడి నిమిత్తం 265 గ్రాముల వెండి పూలహారంను సమర్పించారు.  ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది.. వారికి  తీర్థ ప్రసాదాలు అందజేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement