నేడు భక్తుల రద్దీ పెరిగింది: డీజీపీ | devotee rush in padmavathi pushkar ghat, says | Sakshi
Sakshi News home page

నేడు భక్తుల రద్దీ పెరిగింది: డీజీపీ

Aug 13 2016 8:27 AM | Updated on Sep 4 2017 9:08 AM

విజయవాడ నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి పుష్కర ఘాట్లకు ఉచిత సిటీ బస్సు సౌకర్యం కల్పించినట్లు ఏపీ డీజీపీ ఎన్ సాంబశివరావు వెల్లడించారు.

విజయవాడ : విజయవాడ నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి పుష్కర ఘాట్లకు ఉచిత సిటీ బస్సు సౌకర్యం కల్పించినట్లు ఏపీ డీజీపీ ఎన్ సాంబశివరావు వెల్లడించారు. ఈ బస్సు సేవలను వినియోగించుకోవాలని యాత్రికులకు ఆయన సూచించారు. శనివారం పద్మావతి ఘాట్ను సాంబశివరావు సందర్శించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... నిన్నటితో పోల్చిస్తే.. అంటే కృష్ణా పుష్కరాల ప్రారంభం రోజు కంటే శనివారం భక్తుల రద్దీ పెరిగిందన్నారు. పుష్కర ఘాట్ల వద్ద పిల్లలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement