డిగ్రీలో మార్కులకు బదులుగా గ్రేడ్‌పాయింట్స్‌ | degree marks changed to grades | Sakshi
Sakshi News home page

డిగ్రీలో మార్కులకు బదులుగా గ్రేడ్‌పాయింట్స్‌

Aug 9 2016 2:21 AM | Updated on Sep 4 2017 8:25 AM

ప్రొజెక్టర్‌ ద్వారా వర్క్‌షాప్‌లో అవగాహన కల్పిస్తున్న విష్ణువర్ధన్‌రెడ్డి

ప్రొజెక్టర్‌ ద్వారా వర్క్‌షాప్‌లో అవగాహన కల్పిస్తున్న విష్ణువర్ధన్‌రెడ్డి

మార్కులకు బదులుగా గ్రేడ్‌పాయింట్స్‌ ఇచ్చేలా యూజీసీ డిగ్రీ విద్యలో అనేక మార్పులు చేపట్టిందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈఎంఆర్‌సీ డైరెక్టర్, ప్రొఫెసర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.

  • ఈఎంఆర్‌సీ డైరెక్టర్, ప్రొఫెసర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి
  • జడ్చర్ల టౌన్‌ : మార్కులకు బదులుగా గ్రేడ్‌పాయింట్స్‌ ఇచ్చేలా యూజీసీ డిగ్రీ విద్యలో అనేక మార్పులు చేపట్టిందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈఎంఆర్‌సీ డైరెక్టర్, ప్రొఫెసర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. సోమవారం బూర్గుల రామకృష్ణారావు జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీకళాశాలలో నిర్వహించిన సీబీసీఎస్‌ (చాయిల్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌) వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని ప్రొజెక్టర్‌ ప్రదర్శన ద్వారా జిల్లాలోని డిగ్రీ కళాశాలల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. డిగ్రీ విద్యావిధానంలో మార్పులు చోటుచేసుకున్నాయని, సంప్రదాయ విధానం కాకుండా విద్యార్థికి వెసులుబాటు కల్పించే విధంగా తనకు నచ్చి విషయాన్ని ఐచ్చికంగా ఎన్నుకోవచ్చన్నారు. సైన్స్‌ విద్యార్థి ఆర్ట్స్‌లో ఒక సబ్జెక్ట్‌ను ఐచ్చికంగా తీసుకొవచ్చన్నారు. పరిసరాల విజ్ఞానం, ఆంగ్లం, ఆధునిక భారతీయ భాషల్లో ఒకదానిని తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. వర్క్‌షాప్‌ను పాలమూరు యూనివర్సిటి రిజిస్ట్రార్‌ పాండురంగారెడ్డి పర్యవేక్షించగా పీయూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ మధుసూదన్‌ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ భక్తవత్సల్‌రెడ్డి, ఎంవీఎస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ యాదగిరి, కళాశాల అధ్యాపకులు కృష్ణకుమార్, తమ్మిరెడ్డి, సురేష్, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణయ్య  పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement