ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య | Degree girl student commits suicide hanging herself | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

Oct 28 2015 3:46 PM | Updated on Sep 3 2017 11:38 AM

డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకొని మృతిచెందింది.

మధిర(ఖమ్మం): డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకొని మృతిచెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం మడుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అమర్లపూడి లలిత(21) డిగ్రీ పూర్తి చేసి ఇంటిదగ్గరే ఉంటోంది. ఈ క్రమంలో ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.

కాగా.. మృతురాలి సోదరుడు మాత్రం తన చెల్లె నెయిల్ పాలిష్ తాగి ఆత్మహత్య చేసుకుందని.. అనంతరం ఉరి వేసుకుందని పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడు. ఇంట్లో ఉరి వేసుకోవడానికి అవకాశమే లేదని పోలీసులు అనడంతో ఆమె సోదరుడు ఈ కథ అల్లడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement