డిసెంబర్‌ 11, 12 తేదీల్లో హనుమద్‌వ్రతం | December 11 and 12, respectively hanumadvratam | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 11, 12 తేదీల్లో హనుమద్‌వ్రతం

Oct 25 2016 12:33 AM | Updated on Jun 1 2018 8:39 PM

కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో డిసెంబర్‌ 11,12 తేదీల్లో హనుమద్‌వ్రతాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ముత్యాలరావు తెలిపారు. సోమవారం ఆలయంలో హనుమద్‌వ్రతం ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.

  •  నెల 31 నుంచి మండల దీక్షలు ప్రారంభం
  • గుంతకల్లు రూరల్‌:   కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో డిసెంబర్‌ 11,12 తేదీల్లో  హనుమద్‌వ్రతాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు  ఆలయ ఈవో ముత్యాలరావు  తెలిపారు. సోమవారం ఆలయంలో  హనుమద్‌వ్రతం ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.   ఈవో, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ మాట్లాడుతూ ఈ నెల 31 నుంచి  హనుమద్‌ వ్రత మండల దీక్షలు , నవంబర్‌ 21 నుంచి అర్ధమండల దీక్షలు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు.  డిసెంబర్‌ 11న స్వామివారి తిరుఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.   డిసెంబర్‌ 12 న స్థానిక గంగా నిలయంలో  హనుమద్‌ వ్రతం కార్యక్రమాన్ని  నిర్వహించనున్నామన్నారు.  ఆలయ ప్రధాన అర్చకుడు వసుదరాజాచార్యులు,   ఏఈవో మధు, సూపరింటెండెంట్‌ మల్లయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

     

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement