ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలన్నీ ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్థికSభరోసా ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యం, పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ మనోహర్ డిమాండ్ చేశారు.
హిందూపురం అర్బన్ : ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలన్నీ ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్థికSభరోసా ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యం, పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ మనోహర్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ సీఎం, మంత్రులు, అధికారుల పర్యటనలకు చేస్తున్న ఖర్చును రైతులకు పంట నష్టపరిహారంగా అందించవచ్చునన్నారు. అంతేకాకుండా ప్రధాని ఫసల్ బీమా పథకాన్ని వేరుశనగ రైతులకు కూడా వర్తింపజేయాలని తెలిపారు.
జిల్లా సర్వసభ్య సమావేశం
నియోజకవర్గంలో సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతినెలా చేపడుతున్న ప్రజా పోరుబాటలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో జిల్లా స్థాయి సమావేశాలు కొనసాగిస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యం చెప్పారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 3న హిందూపురంలోని ఇందిరమ్మ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ఉంటుందని అదేరోజు మధ్యాహ్నం కేహెచ్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా సర్వసభ్య సమావేశం జరుగుతుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్‌నాయకులు రమణ, ఆదిమూర్తి, శైవలి రాజశేఖర్, జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, రవూఫ్, యూత్ కాంగ్రెస్ నాయకులు రెహమత్, జబీ, మధు, జమీల్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.