రేపు వైఎస్సార్‌ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్సార్‌ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

Published Sun, Mar 10 2024 8:30 AM

- - Sakshi

కడప సెవెన్‌ రోడ్స్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11 తేదీ జిల్లా పర్యటనకు వస్తున్నారు. పులివెందులలో ముఖ్యమంత్రి వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. అధికారికంగా ఖరారైన సీఎం పర్యటన వివరాలు ఇలా..

సోమవారం ఉదయం 10.20 కడప ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. –అక్కడి నుంచి 10.25కు హెలికాప్టర్‌లో బయలు దేరి 10.40 పులి వెందులలోని భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

10.45కు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలు దేరి 10.55కు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ గవర్నమెంట్‌ హాస్పిటల్‌ వద్దకు చేరుకుంటారు. 11.35 వరకు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

► 11.35 రోడ్డు మార్గాన బయలు దేరి 11.45కు బనాన ఇంటి గ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ప్యాక్‌ హౌస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు.

అనంతరం అక్కడి నుంచి బయలు దేరి 12.10 డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ మినీ సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌ వద్దకు చేరుకుంటారు. 12.25 వరకు కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు.

12.25కు అక్కడ బయలుదేరి 12.30 డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ జంక్షన్‌ వద్దకు చేరుకొని 12.35 వరకు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

12.35 నుంచి 12.40 వరకు సెంట్రల్‌బోలే వార్డు ప్రారంభిస్తారు. –అనంతరం అక్కడ బయలు దేరి 12.50కి వైఎస్‌ జయమ్మ షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్దకు చేరుకొని ఒంటి గంట వరకు కాంప్లెక్స్‌ ప్రారం భోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

అనంతరం అక్కడ బయలు దేరి 1.05కు గాంధీ జంక్షన్‌ చేరుకొని 1.10 వరకు జంక్షన్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలు దేరి 1.15 డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉలిమెల్ల లేక్‌ ఫ్రంట్‌ వద్దకు చేరుకొని 1.40 వరకు దాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు. –అనంతరం అక్కడ బయలు దేరి 1.50కి ఆదిత్య బిర్లా యూనిట్‌ వద్దకు చేరుకుంటారు. 2.05 వరకు ఆదిత్య బిర్లా యూనిట్‌ ఫేస్‌–1ప్రారంభోత్సవంలో గడుపుతారు.

అనంతరం అక్కడ బయలు దేరి సమ్యూ గ్లాస్‌ హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు.

2.15కు హెలిక్టాపర్‌లో బయలు దేరి 2.25కు ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

2.30కి రోడ్డు మార్గాన బయలు దేరి 2.35కు వైఎస్‌ఆర్‌ మెమోరియల్‌ పార్క్‌ వద్దకు చేరుకుంటారు. 2.55 వరకు పార్క్‌ ప్రారంభోత్సవంలో గడుపుతారు.

అ తర్వాత అక్కడి నుంచి బయలు దేరి 3.00 గెస్ట్‌ హౌస్‌ చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల వరకు రిజర్వ్‌

సాయంత్రం 4 గంటలకు గెస్ట్‌ హౌస్‌ బయలే దేరి 4.05 ఇడుపుల పాయ హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు.

4.10కి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలు దేరి 4.25కు కడప ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు.

4.35కు కడప ఎయిర్‌ పోర్ట్‌ నుంచి విమానంలో బయలు దేరి 5.25కు గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ చేరుకుంటారు.

5.30 అక్కడి నుంచి రోడ్డు మార్గాన 5.50కి ముఖ్యమంత్రి అధికార నివాసానికి చేరుకుంటారు.

Advertisement
 
Advertisement