బనగానపల్లె ఆసుపత్రిలో అంధకారం | darkness in banaganapalli hospital | Sakshi
Sakshi News home page

బనగానపల్లె ఆసుపత్రిలో అంధకారం

Jun 23 2017 11:37 PM | Updated on Sep 5 2017 2:18 PM

బనగానపల్లె పట్టణంలో శుక్రవారం సాయంత్రం కురిసిన ఓ మోస్తరు వర్షానికి స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాల ఎదురుగా ఉన్న ఏళ్ల నాటి వేప చెట్టు నేల కూలింది. పక్కనే ఉన్న తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనంపై పడటంతో పాక్షికంగా ధ్వంసమైంది.

బనగానపల్లె రూరల్‌: బనగానపల్లె పట్టణంలో శుక్రవారం సాయంత్రం కురిసిన ఓ మోస్తరు వర్షానికి స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాల ఎదురుగా ఉన్న ఏళ్ల నాటి వేప చెట్టు నేల కూలింది. పక్కనే ఉన్న తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనంపై పడటంతో పాక్షికంగా ధ్వంసమైంది. అలాగే విద్యుత్‌ తీగలపై కొమ్మలు పడటంతో ఆసుపత్రికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్‌ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. కాగా వీలు కాలేదు. దీంతో ఆసుపత్రిలోని బాలింతలు, రోగులు చీకట్లో అవస్థలు పడ్డారు.    
 

Advertisement
 
Advertisement
Advertisement