విశాఖలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ | cyber police station to setup in visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్

Oct 8 2015 1:41 PM | Updated on May 3 2018 3:17 PM

విశాఖపట్నంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్టీల్ ప్లాంట్ వంటి  భారీ పరిశ్రమలతోపాటు సెజ్, ఐటీ హబ్, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నగరంలో ఏర్పాటు కానుండటంతో సైబర్ నేరాలు పెరిగే అవకాశముందని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి.

దీన్ని పరిగణనలోకి తీసుకున్న డీజీపీ జేవీ రాముడు విశాఖపట్నంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. ఈమేరకు అనుమతి మంజూరు చేస్తూ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్టేషన్‌కు ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు ఎసై్సలు, ముగ్గురు అసిస్టెంట్ ఎసై్సలు, ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 43 మంది కానిస్టేబుళ్లను కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement