కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు | Currency troubles in the ongoing | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు

Dec 5 2016 11:37 PM | Updated on Jun 1 2018 8:39 PM

కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు - Sakshi

కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు

అనంతపురం జిల్లాలో 27వ రోజు సోమవారం కూడా నగదు కష్టాలతో జనం ఇబ్బంది పడ్డారు. అనంతపురం, హిందూపురం, తాడిపత్రి, గుంతకల్లు లాంటి ప్రధాన పట్టణాల్లో బ్యాంకుల వద్ద ఉద్యోగులు, పెన్షనర్లు, సామాన్యులు అవస్థలు పడ్డారు.

అనంతపురం అగ్రికల్చర్‌:   అనంతపురం జిల్లాలో 27వ రోజు సోమవారం కూడా నగదు కష్టాలతో జనం ఇబ్బంది పడ్డారు. అనంతపురం, హిందూపురం, తాడిపత్రి, గుంతకల్లు లాంటి ప్రధాన పట్టణాల్లో  బ్యాంకుల వద్ద ఉద్యోగులు, పెన్షనర్లు,  సామాన్యులు అవస్థలు పడ్డారు.  కదిరి, ఓడీ చెరువు, గుంతకల్లు, యాడికి తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.  విత్‌డ్రాల కోసం వృద్ధులు, వికలాంగులు, రోగులు, గర్భిణులు, బాలింతలు బ్యాంకుల వద్ద పడిగాపులు కాసినా చాలా మందికి నిరాశ తప్పలేదు. సోమవారం విత్‌డ్రాలు చాలా బ్యాంకుల్లో రూ.4 వేల నుంచి గరిష్టంగా రూ.10 వేలు ఇచ్చారు. చిన్న నోట్ల కొరత కొనసాగింది. 80 శాతానికి పైగా రూ.2 వేల నోట్లతో సరిపెట్టారు. రూ.500 నోట్లు ఒకట్రెండు బ్యాంకులు మినహా ఎక్కడా పంపిణీ చేయలేదు.  556 ఏటీఎంలకు గానూ  20 మించి పనిచేయలేదు. జిల్లాలో ఇప్పటివరకు రూ.2,500 కోట్లకు పైగా డిపాజిట్లు వచ్చినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement