జాతీయ చెస్‌ పోటీలకు జిల్లా విద్యార్థులు | Sakshi
Sakshi News home page

జాతీయ చెస్‌ పోటీలకు జిల్లా విద్యార్థులు

Published Mon, Aug 15 2016 8:04 PM

జాతీయ చెస్‌ పోటీలకు జిల్లా విద్యార్థులు

గుంటూరు స్పోర్ట్స్‌: జిల్లా చెస్‌ క్రీడాకారులు బొమ్మిని మౌనిక అక్షయ, హరి సూర్య భరద్వాజ్‌ జాతీయ స్థాయి చెస్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు విజయనగరంలో జరిగిన అండర్‌–19 రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలలో వీరు ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.  అక్టోబర్‌ 8 నుంచి 16 వరకు రాజమండ్రిలో జరిగే అండర్‌–19 జాతీయ చెస్‌ పోటీల్లో పాల్గొంటారు.  ఈ సందర్భంగా వీరిని సోమవారం చంద్రమౌళినగర్‌లోని అసోసియేషన్‌ కార్యాలయంలో అసోసియేషన్‌ కార్యదర్శి చల్లా రవీంద్ర రాజు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శిక్షకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement